నిజామాబాద్ ఐటీ టవర్‌ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన కేటీఆర్.. ఐటీ హబ్ అంటే కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు.. స్థానిక యువత ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిబింబం అన్నారు.భవిష్యత్‌లో ఉద్యోగాలు కావాలన్నా.. మీరే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నా నైపుణ్యం పెంచుకోవాలన్నారు.
ఐటీ హబ్ పక్కనే ప్రత్యేకంగా రూ. 11 కోట్లతో న్యాక్ బిల్డింగ్‌తో పాటు హాస్టల్ వసతిని ఏర్పాటు చేశామని తెలిపారు. దీన్ని కూడా డిప్లొమా, ఐటీఐ, టెన్త్ విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. భవిష్యత్‌లో హైదరాబాద్, అమెరికా వెళ్లాలంటే ఒక మెట్టు ఇక్కడ ఎక్కేందుకు ఐటీ హబ్ ఏర్పాటు చేశామని తెలిపారు.
రూ. 50 కోట్లతో ఐటీ హబ్ నిర్మించాం. ఇక్కడ డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లొమా చదివిన 1400 మంది పిల్లలకు ఉద్యోగాలు కల్పించాం అన్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి…. మన భవిష్యత్ భద్రంగా, తల్లిదండ్రులు గర్వపడేలా ఉండాలంటే.. ఇలాంటి సదుపాయాలను అందిపుచ్చుకోవాలన్నారు. పాలిటెక్నిక్ కాలేజీలో కొత్త బ్లాక్‌ను ప్రారంభించుకున్నాం…. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దుబ్బ ప్రాంతంలో మూడు వైకుంఠధామాలు 15 కోట్ల 50 లక్షలతో అద్భుతంగా నిర్మించారని… హైదరాబాద్‌లోని మహాప్రస్థానం కంటే ఈ వైకుంఠధామాలే బాగున్నాయని చెప్పారు.
Also Read:గృహలక్ష్మి నిరంతర ప్రక్రియ…మార్గదర్శకాలివే