నిమ్స్ వైద్య బృందానికి మంత్రి కేటీఆర్ సన్మానం

31
- Advertisement -

దివాస్ దీక్ష దివాస్ ను పురస్కరించుకొని 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు వైద్య సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఆ వైద్య బృందాన్ని మంత్రి కేటీఆర్ సన్మానించి, వారు అందించిన సేవలకు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్యుల బృందం కేటీఆర్ తో అప్పటి సంఘటనల సమాహారాన్ని, అప్పటి భావోద్వేగాలను నెమరు వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో కేసీఆర్ గారు చేసిన దీక్ష ఫలితంగా తెలంగాణ ఏర్పాటుకు బీజం పడిందని ఆయన ఆరోజు అమరన నిరాహార దీక్షను మొండిగా కొనసాగించడం వల్లనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది అన్నారు. 11 రోజులపాటు కేసీఆర్ గారి ఆరోగ్యానికి సంబంధించి అనేక సార్లు ఆందోళన చెందామని ఆయన ప్రాణానికి ముప్పు కలుగుతుందన్న భయాందోళన తమను వెంటాడేదని విషయాన్ని వారు ప్రస్తావించారు. ఒకవైపు ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే మరోవైపు అప్పటి ప్రభుత్వ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన అనేక రకాల ఒత్తిడిలను తట్టుకోవడం తమకు ఒక సవాలుగా ఉండేది అన్నారు.

Also Read:ఓటర్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి !

ఆరోజు కెసిఆర్ గారు ఏడు రోజుల తర్వాత కూడా తమ నిరాహార దీక్షను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందేమోనని భయం కలిగిందన్నారు. అయితే ఆయన శారీరకంగా పూర్తిస్థాయిలో బలహీనంగా మారినా, ఆరోజు తన దీక్ష కొనసాగించే ముందు మానసికంగా అత్యంత దృఢంగా ఉండడంతోనే అన్ని రోజులు దీక్ష కొనసాగించగలిగారన్నారు.

కెసిఆర్ గారి దీక్ష ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా నిమ్స్ వైద్య బృందం అందించిన సేవలకు తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తెలిపారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కాపాడుకుంటూనే మరోవైపు కుటుంబ సభ్యులుగా కేసీఆర్ గారి ఆరోగ్యం పట్ల తమకు ఆందోళన ఉండేదన్నారు. కెసిఆర్ గారి ఆయన పట్టుదల, మొండితనం వల్లనే ఆయన నిరాహార దీక్షను కొనసాగించగలిగారు అన్నారు. అయితే ఒక కుటుంబ సభ్యుడిగా అనేక సందర్భాల్లో ఆందోళనకు గురైనప్పుడు నిమ్స్ వైద్య బృందం అందించిన మనోధైర్యం ఎప్పటికీ మరువలేమన్నారు. అత్యంత సంక్లిష్టమైన సంక్షోభ సమయంలోను తమ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సజీవంగా నిలిపి స్వరాష్ట్రాన్ని సాకారం చేసెందుకు సహకరించిన వైద్య బృందానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపి వారిని సత్కరించి ఒక జ్ఞాపికను బహూకరించారు.

దీక్ష దీవాస్ ను పురస్కరించుకొని తమతో ప్రత్యేకంగా సమావేశమైన కేటీఆర్ గారికి ఈ సందర్భంగా నిమ్స్ వైద్య బృందం ధన్యవాదాలు తెలిపింది. ఎన్నో సవాళ్లను దాటుకొని సహకారమైన తెలంగాణ ఈరోజు సమగ్రంగా అభివృద్ధి చెందుతున్న తీరు అద్భుతంగా ఉన్నదని ప్రశంసలు కురిపించారు.

Also Read:నేరేడుపండుతో ఆరోగ్య ప్రయోజనాలు?

- Advertisement -