- Advertisement -
చిన్నారులను మంత్రి కేటీఆర్ ప్రేమగా పలకరించారు. మంత్రి ఆప్యాయంగా పరింపు ఆ పసి హృదయాలు ఎంతగానో మురిసిపోయాయి. ఈ దృశ్యంలో కామారెడ్డిలో చోటు చేసుకుంది. మంగళవారం మంత్రి కేటీఆర్ తన నాయనమ్మ వెంకటమ్మ స్మారకార్ధం వారి గ్రామమైన కామారెడ్డి జిల్లాలోని కోనాపూర్‌లో ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఇందులో భాగంగా తన వ్యక్తిగత నిధులతో నిర్మించే నూతన ప్రభుత్వ పాఠశాల భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ చిన్నారులతో మంత్రి కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. త్వరలో మీకు కొత్త బడి రాబోతుంది అని చిన్నారులతో కరచాలనం చేస్తూ సరదాగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎంపీ శ్రీ బీబీ పాటిల్ పాల్గొన్నారు.
- Advertisement -