ఢిల్లీకి మంత్రి కేటీఆర్..

53
- Advertisement -

ఇవాళ్టి నుండి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు మంత్రి కేటీఆర్. పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ అంశాలపై కేంద్ర రక్షణశాఖ, హోంశాఖ, పట్టణాభివృద్ధి శాఖలతో పాటు పలు ఇతర శాఖల మంత్రులను కలిసే అవకాశం ఉంది..

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ నిర్వహణకు చేపట్టి న ఎస్సార్డీపీలో భాగంగా తలపెట్టిన సై వేల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్‌ భూములు కావాలని రక్షణ శాఖను కోరుతుంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి కంటోన్మెంట్‌ భూముల అంశాన్ని ప్రస్తావించనున్నారు కేటీఆర్.

Also Read:CMKCR:నిరంతరం మదిలో ఉంటారు..

అలాగే రసూల్‌పుర వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులకు హోంశాఖ పరిధిలోని భూముల అవసరం ఉండటంతో ఈ అంశంపై హోం మంత్రి అమిత్‌ షాను కలిసే అవకాశం ఉంది.వరంగల్‌ వద్ద ఉన్న మామునూరు ఎయిర్‌పోర్ట్‌,పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌పురీతో సమావేశం కానున్నారు. వీటితోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర పెండింగ్‌ అంశాలపై ఆయా శాఖల కేంద్రమంత్రులను మంత్రి కేటీఆర్‌ కలువనున్నట్టు సమాచారం.

Also Read:మను చరిత్ర ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌: శివ

- Advertisement -