మహాకూటమిలో రోజుకో ముఖ్యమంత్రి:కేటీఆర్

216
- Advertisement -

మహాకూటమి అధికారంలోకి వస్తే రోజుకో ముఖ్యమంత్రి మారుతారని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ కార్యకర్తల విస్థృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. కాంగ్రెస్, టీడీపీ నేతలపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో టీడీపీకి క్యాడర్ లేదు.. కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేడని ఎద్దేవా చేశారు. 67 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు నీళ్లివ్వలేదని.. వారికి ప్రజలే బుద్ది చెప్తారని ఆయన అన్నారు.

గత పాలకుల నిర్లక్ష్యంతోనే పటాన్‌చెరువుతో పాటు శివారు ప్రాంతాలు కాలుష్యమయంగా మారాయని కేటీఆర్ ఆరోపించారు. కొత్తగా ఏర్పాటు చేసే ఫార్మా సిటీలో కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటున్నామని  తెలిపారు. 40వేలకు పైగా మెజార్టీతో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

మహాకూటమికి ఓటు వేస్తే అధికారం చంద్రబాబు చేతిలో ఉంటుందని.. రైతులకు కష్టాలు తప్పవన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపేందుకు చంద్రబాబు కేంద్రానికి 30 ఉత్తరాలు రాశారని.. మహాకూటమిని ప్రజలు పట్టించుకోవడం మానేశారన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని.. ఫార్మా సిటీతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

నాలుగేళ్లలోనే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇస్తున్నామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామని.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో నిరుద్యోగులు లేకుండా.. ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -