తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై చేస్తున్న వ్యాఖలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈరోజు ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ డబ్బు సంచులతో దొరికిపోయినొన్ని టీపీసీసీ అధ్యక్షుడిని చేశారు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. నోరు పారేసుకుంటున్నాడు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎవరూ దిక్కు లేక పక్క పార్టీలో నుంచి ఒకర్ని దిగుమతి చేసుకున్నారు. చంద్రబాబు తొత్తు, బినామీని తీసుకొచ్చి పార్టీకి అధ్యక్షుడిని చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు.
తెలంగాణను సాధించిన నాయకుడు, సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర గల నాయకుడు, ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్. ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి నాయకుడిని పట్టుకొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయన కాలి గోరికి కూడా సరిపోని కొంతమంది నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదు.. ప్రతిపక్షాలకు కూడా అలానే బుద్ధి చెప్తాం అని కేటీఆర్ అన్నారు. సహనానికి ఓపిక ఉంటుంది. ఓపికకు కూడా హద్దులుంటాయి. రాజకీయాల్లో సంస్కారవంతంగా మాట్లాడాలని కోరుకుంటారు. కానీ ఆ పరిస్థితి లేదు. తప్పని పరిస్థితుల్లోనే మాట్లాడుతున్నాం. మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని ఒక మాట అంటే కేంద్ర మంత్రి అని కూడా చూడకుండా లోపల పడేశారు. మరి మేం కూడా చేయమంటారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. జర్నలిస్టు ముసుగులో ఉండి కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జర్నలిజం ముసుగులో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతోంది అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు తిడితే చూస్తూ ఊరుకోవాలా..
ఇంకొయన ఉన్నాడు బండి సంజయ్ అని.. ఆయన పాదయాత్ర చేస్తున్నాడు.. ఆ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలి. కేంద్రం ప్రభుత్వ సంస్థలు అమ్ముతున్నందుకా బండి సంజయ్ యాత్ర.. ఇంకా ఏవైనా భూములు ఉంటే అమ్మడానికా.. మేక్ ఇన్ ఇండియా అని సేల్ ఇండియా చేస్తున్నారు. మోడీ చెప్పిన రెండు కోట్ల ఉద్యోగాలు ఏవి అని కేటీఆర్ ప్రశ్నించారు. బండి సంజయ్ యాత్రలో ప్రతి ఊరులో ఉన్న నర్సరీలు ,వైకుంఠ థామాలు చూసి మాట్లాడాలి. మిషన్ భగీరథ ,మిషన్ కాకతీయకు ఓక్క రూపాయి అయినా కేంద్రం ఇచ్చిందా.. కేంద్ర ప్రభుత్వంలో 8 లక్షల ఉద్యాగాలు కాలీగా ఉన్నాయి.. వీటి గురించి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడరు.. రేవంత్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినందుకే.. కొడంగల్ నుంచి తరిమితే.. చావు తప్పి కన్ను లొట్ట బోయినట్లు మల్కాజిగిరిలో గెలిచాడు. రేవంత్ రెడ్డి ముందు మంత్రి మల్లారెడ్డి సవాల్ పై మాట్లాడి గజ్వేల్ సభ గురించి మాట్లాడితే మంచిది. టీ కాంగ్రెస్‌ను చంద్రబాబు ఫ్రాంచైజీ లెక్క తీసుకున్నడు. చిలక మనదే అయినా..మాట్లాడిస్తున్నది చంద్రబాబు అని రేవంత్ రెడ్డిని మంత్రి కేటీఆర్ విమర్శించారు.