మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్‌ఎస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తాజాగా కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో కుటుంబ సమేతంగా తాంత్రిక పూజలు చేసి ద్రవాలను తీసుకెళ్లి కాళేశ్వరంలో కలిపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదిక ద్వారా తీవ్రంగా స్పందించారు.
బండి సంజయ్‌ను ఇలాగే వదిలేస్తే మతిలేని మాటలు మాట్లాడి సమాజానికి ప్రమాదకరంగా తయారువుతారని వ్యాఖ్యానించారు. సంజయ్‌ను ఇలాగే వదిలెయ్యకండి మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడు. పిచ్చి ముదిరి తొందర్లో కరవడం కూడా మొదలు పెడతారేమో. ఎర్రగడ్డలో ఆయన కోసం బెడ్ సిద్ధంగా ఉంది. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి. అని కేటీఆర్ ట్విటర్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఎప్పటికప్పుడు ట్విటర్ వేదికగా స్పందించే మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రం నిర్ణయంపై తనదైన శైలిలో స్పందించారు. గుజరాత్‌లో కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటుపై కేటీఆర్ ట్విట్ చేశారు. బోర్డులు గుజరాత్‌కు …..బోడిగుండులు తెలంగాణకా అని వ్యంగ్యంగా విమర్శించారు. మోదీ గుండెల్లో గుజరాత్…. తెలంగాణ గుండెల్లో గునపాలా? ఎన్నాళ్లీ దగా? ఇంకెన్నాళ్లీ మోసం? అంటూ ప్రశ్నలు వేశారు.