రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకానికి గ్రామాల్లో మంచి స్పందన లభిస్తుంది. రైతు బంధు చెక్కులు పంచుకుంటూ నాయకులు తమ నియోజకవర్గాల్లో బిజిగా ఉన్నారు. ఇక నేడు రైతు బంధు చెక్కులు పంచడానికి మహబూబ్ నగర్ వెళ్లారు మంత్రి కేటీఆర్. అక్కడ పలువురు రైతులకు రైతు బంధు చెక్కులను అందజేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. కౌలు రైతులు, భూ యాజమనులకు మధ్య పెచీ పెట్టెందుకు ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు. కౌలు దారులకు రైతుబంధు డబ్బులను భూ యజమానులే ఇస్తే బాగుందన్నారు మంత్రి కేటీఆర్.
నేడు మహబూబ్ నగర్ జిల్లా భూత్పుర్ లో రైతు బంధు చెక్కులు పంచిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. రైతుబంధు పథకంపై విపక్ష నేతలు ఇష్టం వచ్చి నట్టు మాట్లాడుతన్నారన్నారు. గడిచిన నాలుగేళ్లలో పాలమూరులో ఏడు లక్షల ఏకరాలకు సాగు నీరందించామన్నారు. కరువు జిల్లాను జలమయం గా చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదన్నారు. కరివేన రిజర్వాయర్ పూర్తయితే భూత్పూర్ లో దాదాపు 60వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఉపాధి హామిని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని అలాగే పడించిన పంటకు మద్దతు ధర 25శాతానికి పెంచాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. రైతు బంధు పథకంపై విమర్శలు చేస్తున్న విపక్షాలు దమ్ముంటే రైతుబంధు చెక్కులను తీసుకొవద్దని సవాలు విసిరారు.