హెచ్ ఎండిఎ మరో పురోగతి సాధించింది. పట్టణ ప్రగతి లో భాగంగా మున్సిపల్ , ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలను అనతికాలంలో ఆచరణలో చేసి చూపించింది హెచ్ఎండిఏ. ప్రజా సంచార ప్రదేశాలు, బ్రిడ్జిలు, అండర్ పాస్ మార్గాల్లో ప్రాపర్ లైటింగ్ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు మంత్రి కేటీఆర్. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ & హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) కమిషనర్ అర్వింద్ కుమార్ పర్యవేక్షణలో ఓఅర్ఆర్ కు మరిన్ని సొగసులు తీర్చిదిద్దారు.
ఔటర్ రింగ్ రోడ్డు(ఓఅర్ఆర్) అండర్ పాస్ లలో సోలార్ లైటింగ్ ఏర్పాట్లు చేశారు. 155 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఓఅర్ఆర్ కు 165 అండర్ పాస్ వేస్ ఉన్నాయి. దాదాపు రూ.1.90కోట్ల వ్యయంతో పూర్తి స్థాయిలో విద్యుదీకరణతో పాటు ఈ నెల 3వ తేదీ నుంచి అర్ధరాత్రి వేళ పట్టపగలును తలపించేలా లైటింగ్ ను ఏర్పాటు చేయనున్నారు.