గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గోన్న అరకు ఎమ్మెల్యే

215
araku-mla

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగుకోట్లకు పైగా మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మొక్కలు నాటారు. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉండాల్సిన అడవుల శాతం కన్నా తక్కువ శాతం అడవులు ఉన్నాయనీ.. మనం మొక్కలు నాటి అడవుల శాతం పెంచాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణలో భాగమవ్వాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం వల్ల మనం భవిష్యత్‌ తరాలకు భరోసా ఇచ్చినట్లవుతుందని ఎమ్మెల్యే అన్నారు.గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌తో పర్యావరణ పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఎంపీ సంతోష్‌ కుమార్‌కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.