పాతబస్తీలో ఎంఐఎంను ఓడిస్తాం: మంత్రి కేటీఆర్

151
ktr
- Advertisement -

గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తాం…డిసెంబర్ 4న టీఆర్ఎస్ నుండి గెలిచిన మహిళా కార్పొరేటర్ మేయర్‌గా ఎన్నికవడం ఖాయమని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. గ్రేటర్ ఎన్నికల్లో మజ్లిస్‌తో దోస్తి లేదని తెలిపిన కేటీఆర్…గత ఎన్నికల్లో పాతబస్తీలో 5 స్ధానాలను గెలిచామని ఈసారి 10 స్ధానాల్లో గెలిచి తీరుతామన్నారు. పాతబస్తీలో ఎంఐఎంను ఓడించి తీరుతామన్నారు.

తాము ఒంటరిగా 150 స్ధానాల్లో పోటీ చేస్తున్నామని తెలిపిన కేటీఆర్…బల్దియాపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ ఆరేండ్ల కాలంలో హైద‌రాబాద్‌లో శాంతి భ‌ద్ర‌త‌లు ప‌టిష్టంగా ఉన్నాయ‌ని తెలిపారు.

న‌గ‌రంలో పేకాట క్ల‌బుల్లు లేవు.. గుడుంబా గ‌బ్బు లేదు.. బాంబు పేలుళ్లు లేవు.. మ‌త క‌ల్లోలాలు లేవు.. అల్ల‌ర్లు లేవు.. క‌ర్ఫ్యూ లేదు.. ఆక‌తాయిల‌ ఆగ‌డాలు లేవు.. పోకిరీల పోక‌డ‌లు లేవు. ఇవి వాస్త‌వం ఇవ‌న్నీ మీరు ఆలోచించాలి అని ప్ర‌తిప‌క్షాల‌కు కేటీఆర్ సూచించారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు జలమండలి ముందు ప్రతి వేసవి కాలంలో ధర్నాలు చేసేవారని, 14 రోజులకు ఒకరోజు మంచినీళ్లు వచ్చే దుస్థితి ఉండేదని, హైదరాబాద్ నగరవాసుల నీటి అవసరాలకు ప్రత్యేక రిజర్వాయర్ ఉండాలని ఏ నాయకుడు ఆలోచించలేదని అన్నారు.

- Advertisement -