- Advertisement -
లండన్లో యుకె ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అధ్యక్షత వహించారు. డెలైట్, హెచ్ఎస్బీసీ,జేసీబీ,ఈ అండ్ ఐ,రోల్స్ రాయ్స్ పీఎల్సీ, తదితర సంస్థల అత్యున్నత ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఐటి శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల పారిశ్రామిక విధానాలను మంత్రి వివరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ వంటి ప్రాధాన్యతా రంగాలలో పెట్టుబడి అవకాశాలను మంత్రి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్ మరియు మానవ వనరుల లభ్యత గురించి మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.
- Advertisement -