లండన్‌లో మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు

100
trs
- Advertisement -

ఎన్నారై టి.ఆర్.యస్ యుకె శాఖ ఆధ్వర్యంలో లండన్ లో తెలంగాణ మంత్రి వర్యులు, తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ. కెటిఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.కేటీఆర్ గారి పిలుపు మేరకు “గిఫ్ట్ ఏ స్మైల్” లో భాగంగా గిఫ్ట్ ఏ స్మైల్’ పేరిట ఎన్నారై టి.ఆర్.యస్ యుకె శాఖ కార్యవర్గ సభ్యులు యూకే NHS కి రక్త దానం ఇవ్వడం జరిగింది.ఎన్నారై టి ఆర్ యస్ యుకె అద్యక్షులు అశోక్ దుసరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి తెరాస కార్యకర్తలు హాజరు అయి రక్త దానం చేశారు.

ఎన్నారై టి.ఆర్.యస్ ఆద్వర్యం లో జరిగిన వేడుకల్లో అద్యక్షులు అశోక్ దూసరి మాట్లాడుతూ కెటిఆర్ గారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కెటిఆర్ గారు అహర్నిశలు కష్టపడుతున్నారని, పెట్టుబడుల కోసం ఒక ఋషి చేసిన యాగంలా ప్రపంచ దేశాల సదస్సుల లో తెలంగాణ ప్రాముఖ్యతను ముందుకు తీసుకెళ్లడం కేటీఆర్ గారి పట్టుదల చాల గొప్పదని మరియు ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ కి కెటిఆర్ గారు మరియు యావత్ టి.ఆర్.యస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సంధర్భంగా అడ్విసోరీ బోర్డు వైస్ చైర్మన్ సీకా చందు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు.టి.ఆర్.యస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని,అందరి సూచనలను తీసుకొని ముందుకు వెళ్తుందని కాబట్టి ఎటువంటి సలహాలు సందేశాలు వున్నా వ్యక్తిగతంగా గానీ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు అని తెలిపారు.

ఎన్నారై టి.ఆర్.యస్ ప్రధాన కార్యదర్శి మరియు టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ నేడు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఉందనీ,ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఐటి రంగంలో అభివృద్ధి సాధిస్తున్నదని అన్నారు.నేడు తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశానికే తలమానికంగా నిలపడంలో కేటీఆర్ గారి కృషి మరువలేనిదని తెలిపారు.

చివరిగా ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఇలా వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, ప్రతి ప్రవాస బిడ్డ కేటీఆర్ గారి వెంటే ఉంటామని, హాజరైన కార్యవర్గ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన వేడుకల్లో, కేక్ కట్ చేసి కేటీఆర్ గారికి శుభాకాంక్షలు తెలిపి, ప్రతీ సంవత్సరం లండన్ లో కేటీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నామని తెలిపారు.ఈ వేడుకల్లో ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ అద్యక్షులు అశోక్ దూసరి, ఎన్నారై టి.ఆర్.యస్ ప్రధాన కార్యదర్శి మరియు టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, అడ్వైసర్ బోర్డు వైస్ చైర్మన్ సీకా చందు గౌడ్, కార్యదర్శులు సత్య చిలుముల ,సృజ న్ రెడ్డి , జాయింట్ సెక్రటరీ సతీష్ రెడ్డి మరియు గణేష్, నిఖిల్ పాల్గొన్నారు.

- Advertisement -