ట్రెండ్‌ సెట్ట్ చేస్తున్న ఓ తేనే పలుకుల @2.5 మి.వ్యూస్

21
kalyanram
- Advertisement -

నటన వారసత్వం పునికిపుచ్చుకొన్న నందమూరి వారసులల్లో కళ్యాణ్‌ రామ్‌ ఒక్కరూ. సినీ ఇండస్ట్రీలో ఈయన ప్రయోగాలకు పెట్టిన పేరు తనదైన కథాబలంతో ముందుకు సాగే ఈ నటుడు. తాజాగా సోషియో ఫాంటసీ మూవీగా తెరమీదికి బింబిసారగా రాబోతున్నారు. ఈ చిత్రంలోని ఓ తేనే పలుకుల అంటూ సాగే మెలోడీయస్‌ వీడియో సాంగ్‌ శనివారం విడుదల కాగా…. తాజాగా ఆ పాట ట్రెండ్‌ సెట్ట్ చేస్తుంది. వ‌రికుప్ప‌ల యాద‌గిరి సాహిత్యం అందించిన ఈ పాట‌ను హైమ‌త్‌, స‌త్య యామిని ఆల‌పించారు. ఈ చిత్రంలో క‌ళ్యాణ్‌రామ్ రెండు విభిన్న పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. ఈ చిత్రం మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహించగా…. ఎన్‌టీఆర్ అర్ట్స్ బ్యాన‌ర్‌పై క‌ళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించారు. కేథ‌రిన్ ట్రెసా, సంయుక్త మీన‌న్, వారినా హుస్సేన్‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. ఎమ్‌.ఎమ్ కీర‌వాణి సంగీతాన్ని అందించారు. బింబిసార మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లను ఇస్తుంది.

- Advertisement -