ప్రధానికి కేటీఆర్ విన్నపం..

19
ktr
- Advertisement -

75వ స్వాతంత్య్ర దినోత్స‌వం రోజున గుజ‌రాత్‌లో 11 మంది రేపిస్టుల‌ను రిలీజ్ చేశారు. దీనిపై తనదైన శైలీలో స్పందించారు మంత్రి కేటీఆర్. రేపిస్టుల‌ను రిలీజ్ చేయాల‌ని గుజ‌రాత్ ప్ర‌భుత్వం ఇచ్చిన ఆదేశాల‌ను ర‌ద్దు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్రధానిని కోరారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడిన మాటలను గుర్తుచేస్తూ…దేశ మ‌హిళ‌ల‌ను గౌర‌వించాల‌ని మీరు మాట్లాడిన మాటల్లో నిజం ఉంటే, గుజ‌రాత్ లో రిలీజైన 11 మంది రేపిస్టుల అంశంలో జోక్యం చేసుకోవాల‌ని డిమాండ్ చేశారు. గుజ‌రాత్ ప్ర‌భుత్వం రేపిస్టుల‌ను రిలీజ్ చేసిన ఘ‌ట‌న వికారంగా ఉంద‌ని… రేపిస్టుల‌కు బెయిల్ ఇవ్వ‌కుండా చ‌ట్ట స‌వ‌ర‌ణ‌లు చేయాల‌ని ప్ర‌ధాని మోదీని మంత్రి కోరారు.

2002లో గుజ‌రాత్ అల్ల‌ర్ల స‌మ‌యంలో బిల్కిస్ బానో అనే మ‌హిళ‌పై గ్యాంగ్ రేప్ జ‌రిగింది. అయిదు నెల‌ల ప్రెగ్నెంట్ మ‌హిళ‌ను దాహోద్ జిల్లాలో అత్యాచారం చేశారు. ఆమె కుటుంబానికి చెందిన ఏడు మందిని హ‌త‌మార్చారు. ఆ ఘ‌ట‌న‌లో 11 మందికి 14 ఏళ్ల జైలుశిక్ష ప‌డింది.

- Advertisement -