హైదరాబాద్ మెట్రోకు 80 గ్లోబల్ అవార్డులు

428
Ktr In Assembly
- Advertisement -

దేశంలో ఏ మెట్రోకు రానన్ని అవార్డులు హైదరాబాద్ మెట్రోకు వచ్చాయన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ మెట్రోకు ఏకంగా 80గ్లోబల్ అవార్డులు వచ్చాయన్నారు. శాసనసభలో మెట్రో గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందిన మెట్రో హైదరాబాద్ మెట్రో అన్నారు.

ప్రారంభించిన రెండేళ్లలోనే హైదరాబాద్ మెట్రోలో రోజుకు మూడు లక్షల మంది ప్రయాణిస్తున్నారు. చెన్నై మెట్రోలో ఇప్పటికీ 75వేల మంది ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల కంటే మెట్రో ఛార్జీలే తక్కువగా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో మెట్రోరైలు ప్రాజెక్టుపై 370 కేసులున్నాయి.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చినంక సీఎ కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుని రెండేళ్లలోనే 360 కేసులు పరిష్కరించారని తెలిపారు. పాతబస్తికి తప్పకుండా మెట్రో రైలు వస్తుందని స్పష్టం చేశారు. విపక్షాలు మెట్రో రైలుపై అపోహలు సృష్టించడం మానుకోవాలన్నారు. అమరవీరుల స్థూపానికి నష్టం జరగకుండా మెట్రోమార్గాన్ని తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసిందన్నారు.

- Advertisement -