వెయ్యి కోట్ల తో హైదరాబాద్‌లో ఇమేజ్‌ టవర్ఃమంత్రి కేటీఆర్

514
Ktr
- Advertisement -

హైదరాబాద్ లో వెయ్యి కోట్లతో ఇమేజ్ టవర్ నిర్మించబోతున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. ఇండియాజాయ్‌ -2019 ఎక్స్‌పోని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, సినీ నిర్మాత అల్లు అరవింద్‌, దర్శకుడు వంశీ పైడిపల్లి, నటి నమ్రతా శిరోద్కర్‌, గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌ సీఈవో రాజీవ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ వీఎఫ్‌ఎక్స్‌, యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ అసోసియేషన్‌ కలిసి ఇండియాజాయ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ ఎక్స్‌పోలో దిగ్గజ కంపెనీలు పాల్గొన్నాయి. 15 విభాగాల్లో పెయింటింగ్‌ కాంపిటీషన్‌ నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు.

ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ చక్కని వేదికగా మారిందన్నారు. సినిమా రంగంలోని పోస్ట్ ప్రొడక్షన్ పనికి అంతర్జాతీయ స్థాయిని హైదరాబాద్ అందుకుందని చెప్పారు. వీఎఫ్ఎక్స్, గేమింగ్, యానిమేషన్ రంగంలో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోందని తెలిపారు. వీఎఫ్ఎక్స్ కు తలమానికంగా నిలిచే బాహుబలి, ఈగ, మగధీర వంటి చిత్రాలు హైదరాబాద్ లో రూపొందాయని గుర్తు చేశారు. వచ్చే ఏడాది కల్లా ప్రపంచ యానిమేషన్‌ రంగం 270 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది. యానిమేషన్‌తో పాటు గేమింగ్‌ ఇండస్ట్రీ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.

- Advertisement -