ప్లీనరలో 7 అంశాలపై తీర్మానాలుంటాయని తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. హైటెక్స్ ప్లీనరి సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…ఏప్రిల్ 27 2001 న మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. ప్రాంతీయ పార్టీగా ఆవిర్భావించి రాష్ట్ర సాధనే లక్షంగా పని చేశామన్నారు. బాబా సాహెబ్ అంబెడ్కర్ మార్గదర్శనంలో ముందుకు వెళ్ళాం…14 ఏళ్ల పాటు కేసీఆర్ న్యాయకత్వంలో నడిచాం అన్నారు.
పోరాటాల ద్వారా రాష్ట్రం సాదించుకున్నాం..ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాం…ప్రజల ఆశీర్వాదం తో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి గా కేసీఆర్ పదవి బాధ్యతలు చెప్పాట్టారన్నారు. పరిపాలనలో కొత్త పుంతలు తొక్కించి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణ లో తమ జిల్లాలను కలపాలని కోరుతున్నారు…20 సంవత్సరాలు పురస్కరించుకుని పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాలు ప్లీనరి ఘనంగా జరుపుతున్నామని చెప్పారు.
పార్టీ ప్లీనరి కోసం ఏర్పాట్లు చేసిన కమిటీలు దగ్గరుండి చూసుకుంటున్నారు…6 వేల పైచిలుకు ప్రతినిధులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కమిటీలకు హృదయ పూర్వక అభినందనలు…ఉదయం 10 గంటలకు ప్లీనరి ప్రారంభం అవుతుందన్నారు. 10 30 వరకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి, 11 గంటలకు అందరూ ఆశీనులవ్వాలన్నారు. 35 రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేశాం…పార్కింగ్ 50 ఎకరాల్లో ఏర్పాటు చేశామన్నారు.
నగర ప్రజలకు అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం…సహాయకులకు భోజన ఏర్పాట్లు ఇతర వసతులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. పురుషులు గులాబీ రంగు చొక్కలు, మహిళా ప్రతినిధులు గులాబీ రంగు చీరలు ధరించి రావాలని విజ్ఞప్తి చేశారు. రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేశాం…ఎవరికి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 1 గంట వరకు మొదటి సెషన్ 1 గంట వరకు 1 గంట నుండి 2 గంటల వరకు భోజనం కార్యక్రమం ఉంటుంది…2 గంటల నుండి 5 గంటల వరకు ప్లీనరి కొనసాగుతుందన్నారు.
రాష్ట్రానికి సంబంధించిన వాటి మీద, కేంద్రాన్ని నిలదిస్తూ పార్టీ వైఖరి ఉంటుందన్నారు. హుజురాబాద్ లో రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటెల పోటీ చేస్తున్నాడు..కాంగ్రెస్ బిజెపి చీకటి ఒప్పందము చేసుకున్నాయన్నారు. ఎన్ని ఎత్తుగడలు వేసిన వారి చీకటి ఒప్పందాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు గెల్లు శ్రీనివాస్ ని గెలిపిస్తారన్నారు. 50 కోట్ల కు పిసిసి అమ్ముకున్నాడని మానిక్కం ఠాగూర్ మీద వారి పార్టీ నాయకులే చెబుతున్నారు..అమరిందర్ సింగ్ కూడా చెప్పాడు..ఆరెస్సెస్ మూలాలు ఉన్న వారిని కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు నిలదీస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్ బిజెపి నిజామాబాద్,కరీంనగర్ లో ఒప్పందం కుదుర్చుకున్నాయి….రేవంత్ రెడ్డి,ఈటెల రాజేందర్ గోల్కొండ కలుసుకున్నారు అక్కడ చూసిన వాళ్ళు మాకు చెబుతున్నారు..ఎన్నికల కమిషన్ వారి పరిధి దాటి పనిచేస్తున్నారని అనిపిస్తుందన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతం కాకుండా దాని చుట్టుపక్కల కూడా సభలు పెట్టొద్దనడం విడ్డురంగా ఉందన్నారు.