KTR:జాబ్ క్యాలెండర్‌ రిలీజ్ చేస్తాం

45
- Advertisement -

రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు మంత్రి కేటీఆర్. ఎన్నికల రిజల్ట్స్ రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. చౌటుప్పల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్‌లో మాట్లాడిన కేటీఆర్…కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ 80 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని … తొమ్మిదేళ్ల పాలనలో మైనారిటీలకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం చాలా చేసిందని, వారి మద్దతు తమకే ఉంటుందన్నారు.

మునుగోడు వెనుకబాటుకు కారణమే కాంగ్రెస్ అని…50 ఏళ్ల పాటు మనుగోడు ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే పింఛన్‌ను రూ.5వేలకు పెంచుతామని.. సౌభాగ్యలక్ష్మి పథకం కింద 18ఏళ్లు నిండిన మహిళలకు రూ.3వేలు అందిస్తామన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అబద్దాలను ప్రచారం చేయడంలో దిట్టా అని.. కాంగ్రెస్‌ హవా అనేది సోషల్ మీడియాలోనే ఉందన్నారు. రైతుబంధు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీని రెండుసార్లు కోరామని…పీఎం కిసాన్‌ సమ్మాన్‌కు లేని అడ్డంకి రైతుబంధుకు ఎందుకు అంటూ ప్రశ్నించారు.

Also Read:చలికాలంలో ఇవి తింటున్నారా?

- Advertisement -