రైతన్న కళ్లలో మురిపెం కనపడుతోంది: కేటీఆర్

191
ktr

సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణలో సాగువిస్తీర్ణం పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సాగులో దేశంలోనే మొదటిస్ధానంలో నిలిచిందని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.

ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…ఒకనాడు సాగునీరు లేక నెర్రెలు బారిన ఈ నేల నేడు రైతుబంధు కేసీఆర్ గారి నేతృత్వంలో నదీ జలాలు పారగా వ్యవసాయంలో నూతన రికార్డులు సృష్టిస్తోంది..ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను సస్యశ్యామలం చేస్తుంటే, రైతన్న కళ్ళలో మురిపెం కనపడుతోందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.