కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మంలోనూ ఐటీ హబ్‌లు నిర్మిస్తామన్నారు మంత్రి కేటీఆర్. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా టీ హబ్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేటీఆర్ …ఈ ఏడాది చివరి నాటికి రెండో దశ టీ హబ్ పూర్తి చేస్తామని తెలిపారు.
రాష్ర్టంలో టీ హబ్ 2015, నవంబర్‌లో ఏర్పాటు చేయడం చేశామని అనతికాలంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యూబేటర్‌గా ఇది రూపొందిందన్నారు. టీ హబ్ ప్రత్యక్షంగా పదకొండు వందల స్టార్టప్‌లకు మద్దతివ్వగా, అవి 1800 కోట్లకు పైగా నిధులను సమకూర్చాయి. దీని ద్వారా 25 వేల మందికి పైచిలుకు యువతీయువకులకు ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు.
3 ఎకరాల్లో నిర్మిస్తున్న రెండో విడత టీ హబ్ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని చెప్పారు. దీనిలో వెయ్యికి పైగా స్టార్టప్‌లకు అనుమతిస్తామన్నారు. టీ హబ్ ద్వారా 8 రాష్ర్టాలతో ఒప్పందం చేసుకున్నామని…. రైతులకు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు వేదికల ద్వారా అందిస్తామని చెప్పారు.