టీ హబ్‌తో ఔత్సాహిక యువకులకు ప్రోత్సాహం: కేటీఆర్

198
ktr
- Advertisement -

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ మరియు టీ హబ్ పైన సమీక్ష నిర్వహించారు. టీ హబ్ సీఈవో మరియు ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమీక్ష సమావేశంలో టీ హబ్ సి ఓ రవి నారాయణ్ టీ హబ్ మరియు స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఇప్పటిదాకా చేపట్టిన కార్యక్రమాల పైన మంత్రికి వివరాలను అందజేశారు.

ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే విభిన్న కార్యక్రమాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. గత ఐదు సంవత్సరాలుగా భారతదేశ స్టార్ట్ అప్ ఏకో సిస్టమ్ లో తనదైన ముద్ర వేయకలిగిందని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం టీ హబ్ ద్వారా అద్భుతమైన సేవలను ఔత్సాహిక యువకులకు అందిస్తున్న ఈ నేపథ్యంలో ఇలాంటి సేవలనే ద్వితీయ శ్రేణి నగరాలకు అందించాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా కరీంనగర్ ,వరంగల్, ఖమ్మం ,నిజామాబాద్ వంటి ప్రాంతాల్లోనూ టి హబ్ కి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాల వలన తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టి హబ్, వి హబ్, టీ వర్క్స్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) వంటి ఆర్గనైజేషన్ లతో తెలంగాణలో మంచి ఇన్నోవేషన్ ఈకో సిస్టం ఏర్పడిందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.ముఖ్యంగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటోర్ వంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు, విద్యార్థులకు వారి ఆలోచనలకు ప్రోత్సాహం ఇచ్చేలా కొనసాగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు, వారి యొక్క ఇన్నోవేటివ్ ఆలోచనలకు అండగా నిలిచే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలని సూచించారు. పిల్లలకు కు పాఠశాల స్థాయిలోనే ఇన్నోవేషన్ కి సంబంధించిన సంస్కృతిని (కల్చర్ను) అలవాటు చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా విద్యాశాఖ తో కలిసి పని చేయాలని సూచించారు.

టీ హబ్ ద్వారా టెక్ ఇన్నోవేషన్ తో పాటు రూరల్ మరియు సోషల్ ఇన్నోవేషన్ పైన దృష్టి సారించాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీ హబ్, టీ వర్క్స్, వి హబ్ వంటి సంస్థల ద్వారా ఆయా రంగాల్లో వచ్చే ఆవిష్కరణలకు సహకారం అందించాలని ఆదేశించారు. ఈ రెండు రంగాల్లో ఇన్నోవేషన్ మరింత ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఔత్సాహికులు తమ ఆలోచనలను, ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్న నేపథ్యంలో వ్యవసాయ రంగంలోనూ ఇన్నోవేషన్ మరింత పెరగాల్సిన అవసరం ఉన్నదని ఈ దిశగా రంగంలో పనిచేస్తున్న వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.

- Advertisement -