KTR:ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నాం

57
- Advertisement -

2014లో ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న వ్యక్తి అని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…తెలంగాణ పట్ల విషాన్ని నింపుకున్న ప్రధాన మంత్రికి, తెలంగాణ పట్ల ఇంత వ్యతిరేకత ఎందుకో తెలియదు అన్నారు. గుజరాత్ లోని దహోడ్ లో 20వేల కోట్ల రూపాయలతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు ప్రధానమంత్రి…కానీ రాష్ట్ర పునర విభజన హామీ అయినా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని మాత్రము మొండి చేయి చూపించారన్నారు.

కేవలం 520 కోట్ల రూపాయలతో కోచ్ రిపేర్ ఫ్యాక్టరీ కాజీపేట లో పెట్టి గుజరాత్ కు కోచ్ ఫ్యాక్టరీని తీసుకుపోయారు…తెలంగాణకు 520 కోట్ల రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చి గుజరాత్ కి 20000 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ తీసుకుపోయిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తారు. ప్రధానమంత్రి బూటకపు మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు.

Also Read:వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సాయిచంద్ భార్య

ఇదే వరంగల్ జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ హామీని ఇప్పటి దాకా నెరవేర్చని ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు వస్తున్నారు అని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పిన ప్రధానమంత్రి ఆ హామీని నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని దుయ్యబట్టారు.

తొమ్మిదేళ్లపాటు కాలయాపన చేసిన ప్రధానమంత్రి ఇప్పుడు తెలంగాణకు 520 కోట్ల రూపాయలతో బిచ్చం వేసినట్లు వస్తున్నారు…తల్లిని చంపి బిడ్డను వేరు చేసినారు అన్న ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. మతం పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టిన ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరని…ప్రధాని పర్యటనను పూర్తిగా బహిష్కరిస్తున్నాం, ఎవరము హాజరుకాము అన్నారు.

Also Read:గుజరాత్ హైకోర్టులో రాహుల్‌కి నిరాశే

- Advertisement -