స్లేబ్యాక్ ఫార్మా ప్ర‌ణాళిక‌లు అద్భుతం: మంత్రి కేటీఆర్‌

109
ktr
- Advertisement -

హైదరాబాద్ ఫార్మారంగంలో స్లేబ్యాక్ ఫార్మా అసాధారణ ఎదుగుదల, విస్తరణ ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, లైఫ్ సైన్సెస్ రంగానికి హైదరాబాద్ లో ఉన్న అనుకూలతలను ఉపయోగించుకుని స్లేబ్యాక్ కంపెనీ మరిన్ని విజయాలను సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని అనేక లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ విజయాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని కేటీఆర్ చెప్పారు.

సంక్లిష్టమైన జనరిక్, స్పెషాలిటీ ఔషధాల తయారీ, అభివృద్ధిలో స్లేబ్యాక్ ఫార్మాకు మంచి పేరుంది. 35 మంది సిబ్బందితో 2017లో హైదరాబాద్ లో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించింది. 2018 లో జీనోమ్ వ్యాలీలో పరిశోధన ల్యాబ్ (R&D lab) ప్రారంభంతో కంపెనీ పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 3 యూనిట్లున్నాయి. 106 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్లే బ్యాక్ కంపెనీకి ఇంజెక్టబుల్ ఫార్ములేషన్ డెవలప్‌మెంట్‌ ల్యాబ్, OSD ఫార్ములేషన్ డెవ‌ల‌ప్‌మెంట్‌ ల్యాబ్, ఎనలిటికల్ డెవ‌ల‌ప్‌మెంట్ ల్యాబ్‌లున్నాయి.

- Advertisement -