స్విస్ ఓపెన్ టైటిల్‌ కైవసం చేసుకున్న సింధు…

62
pv
- Advertisement -

బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు చ‌రిత్ర సృష్టించింది. స్విస్ ఓపెన్ బ్యాడ్మింట‌న్ టోర్నీలో టైటిల్‌ను కైవ‌సం చేసుకుంది. ఫైన‌ల్‌లో థాయిలాండ్ ష‌ట్ల‌ర్ బుసాన‌న్‌పై గెలిచి విజేత‌గా నిలిచింది. కేవ‌లం 49 నిమిషాల్లో 21-16, 21-8 తేడాతో బుసాన‌న్‌ను ఓడించింది.

స్విట్జ‌ర్లాండ్‌లోని బ‌సెల్‌లో స్విస్ ఓపెన్ బ్యాడ్మింట‌ర్ టోర్నీ జ‌రుగుతోంది. ఈ టైటిల్‌తో సింధు.. రెండో వుమెన్స్ సింగిల్ టైటిల్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. గ‌త సంవ‌త్స‌రం సింధు.. స్విస్ ఓపెన్ ఫైన‌ల్‌లో రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడ‌లిస్ట్ క‌రోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది.

- Advertisement -