గులాంబ గద్వారా జిల్లా ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టిందని వెల్లడించారు మంత్రి కేటీఆర్. గద్వాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేటీఆర్… సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గద్వాల జిల్లాలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు.
ఇవాళ రూ.104కోట్ల అభివృద్ధి పనులకు ఒకే రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసుకున్నామన్నారు. చరిత్ర తప్ప.. భవిష్యత్ లేని పార్టీ కాంగ్రెస్ అని కేటీఆర్ విమర్శించారు. డబ్బు సంచులతో దొరికినోడు పీసీసీ చీఫ్ అంట.. వాడు కూడా మాట్లాడుతున్నడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు కూడా ఇవ్వదని దద్దమ్మలున్నది కాంగ్రెస్ పార్టీ అని.. పాలమూరు వలసల జిల్లాగా మార్చిన ఘనత పార్టీదేనన్నారు
కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ పథకాలతో ఆడబిడ్డలకు భరోసా కల్పించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఊరూరు తిరుగుతూ మొత్తం నిధులు కేంద్రానివే అని అబద్ధాలు చెప్పుతున్నారని ధ్వజమెత్తారు. బండి సంజయ్ చెప్పేది నిజమైతే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తాను.. అబద్ధం అయితే బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలి అంటూ సవాల్ విసిరారు. ఏడేండ్లలో 1,32,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, పని చేసే ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారన్నారు.