ఎమ్మెల్యే బాజిరెడ్డికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు..

107

సోమవారం టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్దన్‌కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో, బాజిరెడ్డి గోవర్దన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆర్టీసీ మరింత చేరువ కావాలని, ప్రగతిపథంలో ముందుకు సాగాలని మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు. టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ను సీఎం కేసీఆర్‌ ఈనెల 16న నియమించిన విషయం తెలిసిందే.