భాగ్యనగరంలో కుండపోత వర్షం..

68

ఈరోజు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. నగర శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌తోపాటు చార్మీనార్‌లో భారీగా వాన కురిసింది. అత్యధికంగా బహదూర్‌పురాలో 9 సెంటీమీటర్లు, చార్మినార్‌లో 5.5 సెంటీమీటర్లు, సైదాబాద్‌లో 4 సెంటీమీటర్లు, ఝాన్సీబజార్‌లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

నగరంలో ఒక్కసారిగా వాన కురవడంతో రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ నెమ్మదిగా కదులుతున్నది. భారీ వానతో రోడ్లపై నీరు నిలువకుండా జీహెచ్‌ఎంసీ సిబ్బంది, అధికారులు జాగ్రత్తపడుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసింది.