వరంగల్లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో క్రైస్తవ సోదరులు పాస్టర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు,సత్యవతి రాథోడ్ అదేవిధంగా శాసనసభ్యులు నరేందర్, కోరుకటి చందర్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. వరంగల్ నగరపాలక సంస్థకు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా మీ అందరినీ కలుసుకోవడం.. అందరి సహకారాన్ని కూడా అందించమని కోరడం కోసం ఇక్కడ వివిధ వార్డుల్లో ఎవరైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ సంపూర్ణ మైనటువంటి మద్దతునివ్వాలని కారు గుర్తుపై ఓటు వేయాలని కోరుతున్నాం. మన ముఖ్యమంత్రి కెసిఆర్ పంపిన అటువంటి అభ్యర్థులను గెలిపించి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించాలని కోరడం కోసమే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పైన ఉంటుందని భావిస్తున్నాను. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందు ఏరకమైన ఎటువంటి పరిస్థితులను క్రైస్తవ సోదరులు ఎదుర్కొన్నారో తెలుసు. ఒక భద్రత గాని.. ఒక సెక్యూరిటీ కావాలి అని తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీ అయినటువంటి క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు ఈ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు మీ యొక్క అభివృద్ధి పట్ల ప్రభుత్వం ఎంత గొప్పగా నిర్ణయం తీసుకునే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులు అయినటువంటి క్రైస్తవులు ముస్లింలు ఇతర మతస్తులు సిక్కులకు కూడా సామాజిక భద్రత కలిగించింది తెరాస ప్రభుత్వం. ఈ ఆరు సంవత్సరాలలో మైనారిటీలపై దాడులు వేధింపులు సాధింపులు లేవు, తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీలకు ధైర్యాన్ని ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం,
హైదరాబాద్లో బరియల్ గ్రౌండ్ ఎటువంటికు సమస్య దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి వేధిస్తున్న సమస్యను ముఖ్యమంత్రి చొరవతో 62 ఎకరాల భూమిని సేకరించి నిర్మాణం చేపట్టడం జరిగింది. హైదరాబాద్ నగరంలో క్రైస్తవ సోదరులకు ఒక గౌరవప్రదమైన ఎటువంటి గుర్తింపు ఉద్దేశంతో క్రిస్టియన్ భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుని, దాని కోసం 10 కోట్ల రూపాయలు వెచ్చించి రెండెకరాల భూమినిలో పౌండేషన్ వేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
రానున్న కాలంలో క్రైస్తవ సోదరులు కావలసినటువంటి అనేక సంక్షేమ పథకాలు అందించే దిశగా ముఖ్యమంత్రి ఆలోచన. మైనారిటీలను టిఆర్ఎస్ ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. మన భద్రత ఎవరితో సాధ్యమవుతుందో ఇటువంటి విషయాలను తప్పకుండా క్రైస్తవ సమాజం కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. క్రైస్తవ సోదరులకు ముస్లిం సోదరులకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు రక్షకుడిగా ఉన్నటువంటి కెసిఆర్ నాయకత్వం కలకాలం ఉండాలి. ఈ సెక్యులర్ ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగాలి.ఈఎన్నికలలో బ్రహ్మాండమైన విజయం సాధించే విధంగా మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. మీ సహకారం ఉండాలని ఈ సందర్భంగా సోదరులందరినీ కూడా కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు ఆత్మీయ నాయకులు రాజేశ్వర్ ఎమ్మెల్సీ, బండ ప్రకాష్, బొంతు రామ్మోహన్, బాలమల్లు క్రైస్తవ పెద్దలు అయినటువంటి బాబ్జి సాంసంగ్, ప్రేమ్ కుమార్, సామ్యుల్, సాల్మన్ రాజు , మరియు క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.