ఆది ‘అమరన్’ ప్రారంభం..

356
Aadi Sai Kumar
- Advertisement -

టాలీవుడ్ యంగ్‌ హీరో ఆది సాయికుమార్ తాజా చిత్రం ఈ రోజున పూజా కార్యక్రామాలను జరుపుకుంది. ‘అమరన్’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకి వీరభద్రం చౌదరి దర్శకత్వం వహించనున్నాడు. సాయికుమార్ క్లాప్‌తో.. ఆది సాయికుమార్ – అవికా గోర్‌పై ముహూర్తపు షాట్‌ను చిత్రీకరించారు. గతంలో ఆది సాయికుమార్ హీరోగా వీరభద్రం చౌదరి ‘చుట్టాలబ్బాయి’ సినిమా చేశాడు. ఆ సినిమా ఫరవాలేదనిపించుకుంది.

కాగా,కొంత గ్యాప్ తరువాత అవికా గోర్ వరుసగా తెలుగు సినిమాలు ఒప్పుకుంటోంది. ఇప్పటికే చైతూ జోడీగా ‘థాంక్యూ’ చేస్తున్న ఆమె, ఆ తరువాత కల్యాణ్ దేవ్ తాజా చిత్రంలో కథానాయికగా కూడా ఎంపిక అయింది. తాజాగా ఈ సినిమాలోను ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీకి సంబంధించి త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

- Advertisement -