జర్నలీస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారు- కొప్పుల

224
Minister-Koppula-Ishwar
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలీస్టుల పాత్ర కీలకమని, పాత్రికేయుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతున్నరని రాష్ట్ర మంత్రి కోప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం 20లక్షల డిఎంఎఫ్ టి, నాన్ ప్లాంటు నిధులతో గోదావరిఖని ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ శంకుస్థాపన చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ… రాష్ట్రంలోనే గోదావరిఖని ప్రెస్ క్లబ్ చైతన్యానికి మారుపేరుగా ఉందని, తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి జర్నలిస్టు సాగించిన పోరాటం మరువలేనిదన్నారు. ఉద్యమంలో మొదటగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో నిరహారదీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. రాజకీయల్లో తాము ఉన్నతంగా ఎదగడానికి ఇక్కడి పాత్రికేయులే కారణమన్నారు. సమాజ హితం కోసం నిరతరం శ్రమించేవారే జర్నలీని ఈ ప్రాంతంలోని పాత్రికేయులకు అండగా ఉంటమన్నారు.

అనంతరం మంత్రిని ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, జడ్పీటిసి ఆముల నారాయణ, డిప్యూటి మేయర్ నడి పెల్లి అభిషేక్ రావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లవజుల వంశీ, కార్పోరేటర్లు ఇంజపూరి పులిందర్, పెంట రాజేష్, ఎన్.వి రమణరెడ్డి, బాల రాజ్ కుమార్, పాముకుంట్ల భాస్కర్, మేకల సదానందం, జనగామ కవిత సరోజీని, నాయకులు పాతపెల్లి ఎల్ల్యయ, బోడ్డు రవీందర్, కాల్వ శ్రీనివాస్, తోడేటి శంకర్ గౌడ్, ఆడప శ్రీనివాస్, మోతుకు దేవరాజ్, ఇరుగురాళ్ల శ్రావన్, భూరుగు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -