పేదింటి ఆడబిడ్డకు అండగా మంత్రి కొప్పుల..

314
minister koppula
- Advertisement -

రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్- స్నేహాలత దంపతులు గొప్ప ఔదార్యం చాటుకున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన నిరుపేద ఆడపడుచు వివాహానికి పూలు, పండ్లు, పసుపు కుంకుమ పట్టు చీరతో పాటుగా 15,000/- రూపాయలు అందజేశారు. ఆర్థిక పరిస్థితులతో సతమతమవుతూ కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్న నిరుపేద తల్లిదండ్రుల లోటును తీర్చారు ఈ పుణ్యదంపతులు. ఆత్మీయత అనురాగాలు పంచే వాళ్ళు ఉన్నా..అమ్మ నాన్న అనే బంధం తీరని సమస్యల్లోకి వెళ్ళింది. కష్టాలు కన్నీళ్లు వెక్కిరించినా మంచి వారి నుండి చేయూత లభించిందని ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అమ్మ నాన్న అనే బంధం మళ్లీ LM కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూపుదిద్దుకుంది.

మంత్రి కొప్పుల దంపతులు ఎల్.ఎం.కొప్పుల చారిటబుల్ ట్రస్టును నెలకొల్పి కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు పెద్దపెల్లి జిల్లా ధర్మారం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన కాల్వ అంజలి అనే ఆడపడుచు వివాహానికి LM కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెళ్లి శుభకార్యం కోసం ఆడపడుచుకు ఆర్థిక సహాయం అందజేసి నిండు మనసుతో దీవించారు.

అలాగే ట్రస్టు ద్వారా మరో అడబిడ్డకి కూడా సాయం అందించారు. గొల్లపల్లి మండలం లొత్తునూర్ గ్రామానికి చెందిన చిరుత వరలక్ష్మి నిరుపేది కుటుంబం ఈ రోజు కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో కలవగా LM కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ స్నేహలత, మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా వివాహానికి పూలు, పండ్లు, పసుపు కుంకుమ పట్టుచీరతో సహా 15,000 వేల రూపాయల ఆర్థికసాయం చేయడం జరిగింది.

- Advertisement -