విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలిఃమంత్రి కొప్పుల

403
Koppula-Eshwar
- Advertisement -

విద్యార్దులు మంచి ప్రతిభను కనబర్చి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. గోదావరిఖ  సింగరేణి స్టేడియంలో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ బాలోత్సవ్-2019 జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్, పోలీస్ కమీషనర్ సత్యనారాయణ పలువురు అధికారులు పాల్గోన్నారు.

ఈసందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… విద్యార్దుల నైపుణ్యాలను వెలికి తీసేందుకే ఈ బాలోత్సవ్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థుల లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే చక్కటి కార్యక్రమన్ని నిర్వహించడం సంతోషంగా ఉంది. సాంస్కృతిక పోటీలను స్ఫూర్తిగా తీసుకుని విజయాలను సాధించాలి. నిత్యం ఒత్తిడి తో ఉన్న విద్యార్థుల కు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -