తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. విద్య వైద్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, రవి శంకర్, విద్యా సాగర్ రావు, టీఎస్ఎంఎస్ఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండి చంద్రశేఖర్ రెడ్డి, డీఎంఇ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పాటు కావడం వల్లనే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి సీఎం కావడం వల్లనే జగిత్యాల జిల్లాగా ఏర్పడింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు జరుగుతుండడం సంతోషించదగ్గ విషయం అన్నారు. చిన్న పిల్లలకు నాడు అనారోగ్య సమస్యలు వస్తే హైదరాబాద్ దాకా పోవాల్సిన పరిస్థితి.. కానీ ఇప్పుడు వంద పడకల ఆసుపత్రి ఇక్కడే ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. విద్య వైద్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. అభివృద్ధి చేసేందుకు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు అని మంత్రి కొప్పుల పేర్కొన్నారు.