బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు మంత్రి కొప్పుల సవాల్‌..

157
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం రాబట్టే బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు వారి పార్టీలకు అధ్యక్షులు అయ్యారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈరోజు ఆయన జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. సంక్షేమ ఫలాలపై బహిరంగ చర్చకు సిద్దమా అని మంత్రి ఈశ్వర్ బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు సవాల్ విసిరారు. దొంగ పాద యాత్రలు చేస్తూ హిందువులను రెచ్చగొట్టడమే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ఉద్దేశ్యం. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చ గొడుతున్నారు. పాత బస్తీ నుండి పాదయాత్ర చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం అదే అని మంత్రి మండిపడ్డారు.

తెలంగాణలో అధికారం కోసం బిజేపి పాకులాడుతుంది. కాంగ్రెస్, బిజేపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్క సంక్షేమ ఫలం అయిన చూపిస్తారా.. బిజేపి ది రెచ్ఛ గొట్టే వ్యవహారం అని దుయ్యబట్టారు మంత్రి. తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ఎం మాట్లాడుతారో ఆయనకు కూడ తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. మీ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ది చేశారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. కేటిఆర్, హరీష్ రావులు ప్రజలతో ఎన్నుకోబడ్డారు. వాళ్ళు ఈ రోజు రాజకీయాల్లోకి కొత్తగా రాలేదు తెలిపారు.

దేశంలో ఏడు సంవత్సరాలు పరిపాలనలో ఉన్న బిజెపి ఎం చేసిందో చెప్పాలి.. విభజన చట్టాల్లో ఉన్నటువంటి వాటి గురించి ఒక్కటైన అమలు చేయడం కోసం ప్రయత్నాలు జరిగాయో చెప్పాలి.తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నిధులకే కోత పెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర కోసం తెరాస పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, ఆ సమయంలో ఒకే ఒక బిజేపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రాజీనామా చేమంటే పదవులు ముఖ్యం అని పారిపోయారని మంత్రి కొప్పుల ఎద్దేవ చేశారు.

- Advertisement -