తెలంగాణ దేశానికి రోల్ మోడల్- మంత్రి కొప్పుల

138
minister koppula

తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని క్రైస్తవులు మనస్ఫూర్తిగా ప్రార్థనలు చేశారు. ఉద్యమ నేతే సీఎం కావడం వల్ల అన్ని వర్గాల సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌. ఈ రోజు హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ క్లబ్ హౌజ్ లో క్రిస్టియన్ మతపెద్దలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్,కొప్పుల ఈశ్వర్,రాష్ట్ర ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ బి వినోద్‌ కుమార్‌, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్,ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు,సికింద్రాబాద్ బిషప్ తుమ్మ బాల తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ..ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ భేటీలో మంత్రి కేటీఆర్‌ పాల్గొనడం మరింత సంతోషాన్ని కలిగించిందన్నారు. సమావేశంలో మత పెద్దలు మంచి సలహాలు ఇచ్చారు. క్రైస్తవులకు రాష్ట్రంలో అన్ని విధాల మేలు జరుగుతోంది. ఇకముందు కూడా ఇది కొనసాగుతుందని మంత్రి అన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 204 రెసిడెన్షియల్ స్కూళ్ళు ప్రారంభించుకున్నాం. ఇందులో ఎనిమిది వేల క్రైస్తవ పిల్లలు చదువుకుంటున్నారు.

క్రైస్తవ స్మశాన వాటికలకు స్థలాలు ఇవ్వడమే కాదు..వాటిని అభివృద్ధి పరచి ఇస్తున్నాం..ఈ పెద్ద సమస్యకు పరిష్కారం చూపాం. క్రైస్తవ సంస్థల ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతామన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్. ఇక హైదరాబాద్ అభివృద్ధిలో మంత్రి కేటీఆర్‌ పాత్ర అద్వితీయం. డైనమిక్ మినిస్టర్ కేటీఆర్‌ అని కొప్పుల తెలిపారు. మంచి నాయకత్వం ఉంటేనే మంచి ఆలోచనలతో అభివృద్ధి జరుగుతుంది. ఇది తెలంగాణలో అక్షరాల అమలవుతోందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు.