కోవిడ్ చికిత్సపై బరోసా కల్పించాలి- మంత్రి కొప్పుల

44
minister koppula

కోవిడ్ వైరస్ ప్రభావంతో ఎదురయ్యే అనారోగ్య సమస్యలపై జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందుతుందనే బరోసాను ప్రజల్లో కల్పించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం జిల్లాలో లాక్ డౌన్ నిర్వహణ, కోవిడ్ నివారణ చర్యలు, సానిటేషన్ నిర్వహణపై జగిత్యాల జిల్లా కలెక్టర్, వైద్య మరియు ప్రత్యేక అధికారులతో జూమ్ వెబ్ విడియో ద్వారా సమీక్షించారు. అదనపు కలెక్టర్ అరుణ, ఆర్.డి.ఓలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జిల్లా ఆసుపత్రి మరియు మెటపల్లి సూపర్డెంట్లు, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో మొదటి విడత ఫీవర్ సర్వే ద్వారా కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి సకాలంలో మందులను అందించి వారు హోం ఐసోలేషన్ పాటించేలా చేయడం ద్వారా జిల్లాలో కోవిడ్ ప్రబావాన్ని అనుహ్యంగా తగ్గించుకోగలిగామని, ఫివర్ సర్వే సత్పలితాలను అందిస్తున్నందున రెండవ విడత ఇంటింటి సర్వే లో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేసి పాజిటివ్‌గా నిర్దారణ అయిన వారు ఆసుపత్రి వరకు రాకుండా ఇంటిలోనే తగు జాగ్రత్తలతో కరోనా చికిత్స పోంది కరోనా జయించేలా చేయాలన్నారు.

జిల్లాలో అవసరం మేరకు ఐసోలేషన్ సెంటర్లు, ఆక్సిజన్ మరియు రెమిడిసివిర్ ఆందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. కోవిడ్ మరింత సమర్దవంతంగా ఎదుర్కోవాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవెటు ఆసుపత్రులకు కూడా కోవిడ్ చికిత్సను అందించడానికి 25 ప్రయివేటు 2 ప్రభుత్వ ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వడంతో జిల్లాలో 535 బెడ్లు అందుబాటులొకి వచ్చాయని, ప్రవేటు ఆసుపత్రులలో కోవిడ్ చికిత్సపేరుతో ప్రజలనుండి హద్దులు మీరి అధిక ఫీజులు వసూలుచేయడం వంటివి జరుగకుండా కఠినంగా వ్యవహరించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కరోనా సమయంలో సిటి స్క్యాన్ కూడా అవసరమవుతుందని, నిర్వహకులు అధిక ఫీజులను వసూలుచేయడం జరగకుండా, పేదలకు అందుబాటులోకి వచ్చేలా ప్రైవేటు ల్యాబు నిర్వహకులతో సమావేశం నిర్వహించి వారిని హెచ్చరించాలని అన్నారు. పాజిటివ్ గా నిర్దారణ అయిన వారికి ఇచ్చే మెడికల్ కిట్లలో యాంటిబయోటిక్ ఉండేలా చూడడంతో పాటు, మెడిసిన్ చేక్ చేసుకోనేలా జాగ్రతలు వహించాలని అన్నారు.

రెండవ సారి లాక్ డౌన్ ఆమలు అయిన తరువాత కోవిడ్ పరిణామాలను, ఫలితాలను తెలుసుకోవాలని, ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలలో వసతి, మందులు, బోజనం మరియు డాక్టర్ల అందిస్తున్న వైద్య సేవలపై అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఉదయం 10 తరువాత అవసరం లేని వారు రోడ్డుపైకి రాకుండా పోలీస్ వారు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కోవిడ్ పాజిటివ్ తో పాటు డెంగ్యూ ఫీవర్ కూడా వస్తున్న తరుణంలొ జిల్లా నుండి గ్రామస్థాయి వరకు పారిశుద్ద్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, గతంలో నిర్వహించుకున్న పల్లెప్రగతితో గ్రామాలలో సత్పలితాలు వచ్చాయని, పారిశుద్ద్యంపై అన్ని గ్రామాలలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చేయాలని మంత్రి అన్నారు.

జిల్లా ఆసుపత్రి నిర్వహణపై దృష్జిసారించాలని, ఐసోలేషన్ నిర్వహణ బాగున్నప్పటికి కేంద్రాలలో అందించే మెడికల్ కిట్, బోజనం, డాక్టర్ల పర్యవేక్షణపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని అన్నారు. మాకు ఎమవుతుందిలే అని బావించరాదని, వయస్సుతో సంబంధం లెకుండా యుక్తవయస్సు వారు కూడా కరోనా బాదితులుగా మారుతున్నారని, జ్వరం వచ్చిన తరువాత 3 నుండి 4రోజుల తరువాత డాక్టర్లను సంప్రదించిన వారే ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నట్లు గుర్తించడం జరిగిందని, అలా కాకుండా సకాలంలో వైద్య సహయం పోందేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు,జిల్లాలో 108 అంబులెన్సు ద్వారా తక్షణ సహయాన్ని అందిస్తున్నప్పటికి, 108 లేని మండలాల్లో అవసరాన్ని బట్టి అద్దె ప్రాతిపదికన ప్రైవేటు ఆంబులెన్సుల ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని అదేశించారు. అన్ని విషయాలలో అధికారులు బాగా పనిచేస్తున్నారని. మరిన్నీ మెరుగైన సేవల కొరకు క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులు అయిన జిల్లా కలెక్టర్, డిఎంఆండ్ హెచ్ ఒ ల దృష్టికి తీసుకురావాలని. లాక్ డౌన్ లో తీసుకునే చర్యలను లాక్ డౌన్ తరువాత కూడా కోనసాగించి రాబోయో రోజులకు కోవిడ్ కంట్రోల్ చేయాలని తెలియజేశారు.

జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ, జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరి గారి ఆదేశాల మేరకు కోవిడ్ కంట్రోల్ కు చర్యలను చేపట్టడం జరుగుతుందని, హౌస్ టు హౌస్ ఫివర్ సర్వే ద్వారా లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్ అందించడం జరుగుతుందని ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 2లక్షల 60వేల మంది ప్రజలకు ఫీవర్ సర్వే నిర్వహించగా 8300 మంది లక్షణాలు ఉన్నవారిని గుర్తించడం జరిగి వారికి మెడికల్ కిట్లు అందించడం జరిగిందని పేర్కోన్నారు. రెండవ విడత ఫీవర్ సర్వే శనివారం నుండి మొదలు పెట్టి బుధవారం లోగా పూర్తిచేసుకునేలా ఆదేశాలు కూడా జారి చేయడం జరిగిందని పేర్కోన్నారు.రెండవ విడత ఫీవర్ సర్వే చేసే సమయంలో పాజిటివ్ వచ్చిన వారిని గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని గురించి పర్యవేక్షించి, హోంఐసోలేషన్ ద్వారా వ్యాదిని నివారించగలుగుతున్నామని తెలియజేశారు. కోవిడ్ చికిత్స కొరకు జిల్లాలో 27 ప్రైవేటు ఆసుపత్రులతో పాటు మెట్పల్లి సిహెచ్సి, జిల్లా ఆసుపత్రిలలో 535 బెడ్లను ఏర్పాటు చేయడం జరిగి ఈరోజు వరకు 219 బెడ్ల ద్వారా చికిత్సను అందించడంతో పాటు ప్రతిరోజూ ఖాళిగా ఉన్న బెడ్ల వివరాలను కూడా తెలియజేయడం జరుగుతుందని పేర్కోన్నారు.

కోవిడ్ చికిత్స అందించే ఆసుపత్రులలో కూడా ప్రత్యేక సానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, 10 కన్న ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్న గ్రామాలలో ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగిందని, ఆట్టి ఆదేశాల మేరకు 10 కన్న ఎక్కువ పాజిటివ్ పాజిటివ్ ఉన్న గ్రామాలు, వార్డులలో హోంఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి హోంసోలేషన్లో ఉండలేని వారిని, పాజిటివ్ వచ్చి బయట తిరిగే వారిని ఈ ఐసోలిషన్ కేంద్రాలలో ఉంచడం జరుగుతుందని పేర్కోన్నారు. 135సిలిండర్లు ప్రభుత్వ, పైవేటు ఆసుపత్రులకు అందించడం జరుగుతుంది. జిల్లా స్థాయి అధికారితో పాటు డిటిల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుండటంతో పాటు ఆక్సిజన్ ఆడిట్ చేయడం జరుగుతుంది పేర్కోన్నారు. ఆక్సిజన్,మందుల కొరకు జిల్లా అధికారిని మరియు డ్రగ్ ఇన్ స్పెక్టర్ లను నోడల్ అధికారులగా నియమించి ఆక్సిజన్, బెడ్, మరియు మందులపై పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. అధిక వసూలు చేసే ఆసుపత్రులపై దృష్టిసారించడం జరిగిందని, జిల్లాలో కోవిడ్ చికిత్స సక్రమంగా అందించని 3 ఆసుపత్రులకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందని, సిటిస్క్యాన్ కొరకు ఎక్కువ ఫీజు వసూలు చేయకుండా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించేలా ఆదేశాలను జారిచేసి కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టంచేశారు.

ప్రతిరోజు 1600 టెస్టులు చేయడం జరుగుతుందని, ఉదయం 6 నుండి 10 వరకు మార్కెట్లు, ఇతర ప్రాంతాలలో సామాజిక దూరం పాటించడం, మాస్కులు దరించడం వంటివి పాటించని వారికి జరిమానాలు విధిండం జరుగుతుందని, మర్కెట్లలో ఎక్కువ మంది గుమ్మిగుడకుండా అవసరం మేరకు మరిన్ని మార్కెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. కేత్రస్థాయిలో తనిఖీలు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు ఆసుపత్రుల వారితో సమావేశం నిర్వహించి అందించే చికిత్స, ఫీజుల వసూల్లపై ఆదేశాలు జారిచేయడం జరుగుతుందని తెలియజేశారు. ప్రభుత్వం సరఫరా చేసిన మందులతొ పాటు యాంటిబయోటిక్స్ ఉండేలా పర్యవేక్షించడం జరుగుతుంది. ఫివర్ సర్వే చేసే సమయంలో వాడే మందులను కూడా పరిశీలించి అవసరం మేరకు మందులను అందించాలని, లాక్ డౌన్ కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకునేలా ఆధికారులను ఆదేశించడం జరుగుతుందని పేర్కోన్నారు. జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగిందని మరియు అందించే చికిత్సకు సంబంధించి వివరాలను వీడియో రూపంలో ప్రతి రోజు తెప్పించుకొని సమీక్షించడం జరుగుతుందని తెలియజేశారు. కోవిడ్ పై ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు తీసుకోవలసిన మందులు జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ జరిగిన పిదప సకాలంలో వైద్యం చేయించుకోక చివరి దశలో ప్రభుత్వ ఆసుపత్రులకు రావడం వలన దాదాపుగా మరణాల సంఖ్య హెచ్చుగా కన్పిస్తుందని పేర్కోన్నారు. కొవిడ్ చికిత్స పై ప్రజలకు సేవలను అందించడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోవిడ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సహయక చర్యలను చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు.

స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి అరుణశ్రీ మాట్లాడుతూ, జిల్లాలో కొత్త కోవిడ్, డెంగ్యూ కేసులు రాకుండా పకడ్బంది చర్యలు తీసుకోని ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు జరిగేలా ఆదేశించడం జరిగిందని పేర్కోన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడం జరుగుతుందని, ప్రతి మండల కేంద్రంలో అన్ని వసతులు ఉన్న హోం ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవడం జరుగుతుంది. మెడికల్ కిట్ లపై పర్యవేక్షించి అవసరం ఉన్న మందులను అందించడం జరుగుతుందని, ప్రతి ఆసుపత్రి పరిశుభ్రంగాఉండెలా చూడడంతో పాటు అవసరం మేరకు వసతులను కల్పించడం జరగుతుందని తెలియజేసారు.

జిల్లాలో ఆక్సిజన్, బెడ్లు మరియ రెమిడిసివిర్ కొరత లేదని, జిల్లాలో లాక్ డౌన్ విధించడం వలన కోవిడ్ పాజిటివ్ ల సంఖ్య 34 శాతం నుండి 14 శాతానికి పడిపోయిందని, సిటిస్క్యాన్ కొరకు 2000 రూపాయలు ఎటువంటి రిపోర్ట్ లేకుండా, 2500 విత్ రిపోర్ట్ మాత్రమే వసూలు చేసేలా చూడడం జరుగుతుంది. రెమిడిసివిర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ లో తరలకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అధిక వసూలు చేయకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఐసోలేషన్ కేంద్రంలో మందులు అవసరం ఉన్నట్లయితే వెంటనే సమకూర్చడం జరుగుతుంది. ఆసుపత్రులన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పనికిరాని వస్తువులను తొలగించడం జరుగుతుందని, మెడికల్ షాపులలో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కరీంనగర్, పెద్దపల్లి మరియు మంచిర్యాల జిల్లాల నుండి ఆక్సిజన్ సిలీండర్లను తెప్పించి ఆక్సిజన్ కోరత లేకుండా ఆసుపత్రులకు సరఫరా చేస్తూ ప్రతిరోజు 24 గంటలు ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకొవడం జరుగుతుందని పేర్కోన్నారు. కోవిడ్ తో మరణించిన వారికి మున్సిపల్ శాఖ తరుపున ఉచితంగా దహన సంస్కారాలను నిర్వహించడం జరుగుతుందని, తల్లితండ్రులకు కరోనా వచ్చి పిల్లల ఆలన చూడలేని వారి కొరకు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, సంరక్షణ కేంద్రాలలోని పిల్లల ఆరోగ్యంపై డాక్టర్ లను సంప్రదించడడం జరుగుతుందని, ఓంటరి మహిళలకు సఖీ కేంద్రం ద్వారా, వయోవృద్దులకు సేవలను అందించడంతో పాటు, గర్బవతులు, బాలింతలకు అనుమానాలంటె గైనకాలజిస్టులతో చికిత్స అందించడంతో పాటు గర్బవతుల ఇంటికి వెళ్లి వైద్యం అందించడం, గర్బవతులకు ప్రసవానికి ప్రభుత్వ ఆసుపత్రిలో చెయడం పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు తేలియజేశారు.