- Advertisement -
నేడు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక అభివృద్ధి నిధి ద్వారా అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల గురించి హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భూమిలేని నిరుపేదలైన ఎస్సీలకు రైతుబంధు, రైతుబీమా పథకాలకు సమాంతరంగా ప్రత్యామ్నాయ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా వారికి ఆర్థిక చేయూతనిచ్చే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇండ్లు లేని ఎస్సీలందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పనులు జరిగేలా చూస్తామన్నారు. దళితుల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంకితభావంతో కృషి చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
- Advertisement -