‘105 మినిట్స్’.. ఆసక్తిరేపుతున్న హన్సిక ఫస్టులుక్‌..

75
105 Minutes First Look

ఈ రోజున హీరోయిన్ హన్సిక పుట్టినరోజు. ఈ సందర్భంగా హన్సిక ప్రస్తుతం నటిస్తున్న ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ సినిమా నుంచి అసక్తికరమైన ఫస్టులుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. గతంలో హన్సికతో ‘పవర్’ సినిమాను చేసిన దర్శకుడు బాబీతో, ఈ ఫస్టులుక్‌ను రిలీజ్ చేయించారు. ఈ పోస్టర్ ద్వారా ఈ సినిమా టీమ్ ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్నాడు.