సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలతో కలిసి జలహితం కార్యాక్రమాంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలో భాగంగా ప్రతీ గ్రామానికి అందే కాళేశ్వర జలాలను సంపూర్ణంగా సద్వినియోగపరచుకుని, వ్యవసాయ పంటలకు నీరందించే కాలువలను నూటికి నూరుశాతం పునరుద్ధరించే ఉద్దేశ్యంతో ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలంలో దోమలకుంట గ్రామంతో పాటు నందగిరి, బతికెపల్లి గ్రామాల్లో రెండవ విడత జలహితం కార్యాక్రమాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు.
జలహితం కార్యక్రమాన్ని జగిత్యాల, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ లతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించే చెత్త చెదారం, పిచ్చి మొక్కలు,రాళ్ళను శ్రమదానంతో తొలగించారు. ఈ శ్రమదానంలో మంత్రి పాల్గొని స్వయంగా గంపతో మట్టి ఎత్తిపోశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని ప్రతీ కాలువలో సాగునీరు వృధా కాకుండా, పారకం జరిగేలా శ్రద్ద వహించే ఆశయంతో రూపొందించిన కార్యక్రమం జలహితం అని మంత్రి అన్నారు.