పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం- మంత్రి కొప్పుల

146
minister koppula
- Advertisement -

పేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో విజయమ్మ పౌండేషన్ ద్వారా మహిళ సాధికారత కేంద్రాలను ఎర్పాటు చేసి వందలాది మంది పేద మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మార్గాలు చూపుతున్నరని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యక్రమంలో విజయమ్మ పౌండెషన్, స్కూప్ ఇన్ఫటేక్ బాధ్యులు వేణు సంగాని సంయుక్తంగా విజయమ్మ ఫౌండేషన్ ద్వారా కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 37వ డివిజన్ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లను మంత్రి కోప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రామగుండం నియోజకవర్గంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పన కోసం విజయమ్మ ఫౌండేషన్ ద్వారా కుట్టులో శిక్షణతో పాటు కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ అనేక ఉపాధి కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయం అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆ ప్రాంతంలో పేద ఎస్సీ మహీళలకు 500 కుటుంబాలకు కుట్టుమిషన్లు ఏర్పాటు చేస్తానని అన్నారు. ప్రభుత్వం ద్వారా శిక్షణా తరగతులు నిర్వహించి సర్టిఫికెట్లుతో పాటు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఈ ప్రాంతంలో తగినటువంటి స్థలాలను ఏర్పాటు చేయాలని కోరారు. మహిళలు స్వయం ఉపాధిలో రాణించి ఉన్నతంగా ఎదగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ సూఫ్ ఇన్పటెక్ బాధ్యలు వెంకట్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు కార్పొరేటర్లు పెంట రాజేష్ పాముకుంట్ల భాస్కర్ నాయకులు పాతపెల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -