లాల్‌ దర్వాజ బోనాలకు అన్ని ఏర్పాట్లు- మంత్రి అల్లోల

35
minister

ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్‌ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామ‌ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. బోనాల‌కు త‌ర‌లివ‌చ్చే భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ప్ర‌భుత్వం, దేవాదాయ శాఖ ఆద్వ‌ర్యంలో అన్ని సదుపాయాలను సిద్ధం చేశామ‌న్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, అధికార లాంఛనాలు సమర్పిస్తామ‌ని పేర్కొన్నారు. బోనాలు స‌మ‌ర్పించేందుకు వ‌చ్చే భ‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని, మాస్కులు ధ‌రించాల‌ని కోరారు.