నాయి బ్రాహ్మణులు, రజకులు సమాజ సేవకులు- మంత్రి

198
Minister Koppula
- Advertisement -

నాయి బ్రాహ్మణులు, రజకులు సమాజ సేవకులు అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. జమ్మికుంట స్వర్ణ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన నాయి బ్రాహ్మణ,రజక నాయకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరైయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒక్క మాటలో చెప్పాలంటే నాయి బ్రాహ్మణులు కావచ్చు, రజకులు కావచ్చు సమాజ సేవకులు, అందుకే వీరికి సేవ చేస్తే సమాజానికి సేవ చేసినట్లే అన్నారు.అత్యంత పేదరికం ఉన్నా ఎస్సీ, ఎస్టీ కులస్థులు తరువాత పేదరికం ఉన్నవారు నాయి బ్రాహ్మణ, మరియు రజకులే అన్నారు. గ్రామాలలో ఉన్న వారికి భూమి జాగ, వ్యవసాయం ఉండవు, 90 శాతం కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అని మంత్రి తెలిపారు.

హుజూరాబాద్‌లో డబుల్ బెడ్రూం విషయానికి వస్తే 4 వేల డబుల్ బెడ్రూం మంజూరు అవగ వాటి నిర్మాణం పూర్తి కాలేదు. రానున్న కాలంలో ఈ 4వేల బెడ్రూంలతో పాటు మరిన్ని మంజూరు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరి స్థలంలో వారికి డబుల్ బెడ్రూంను కేటాయించే ప్రయత్నం జరుగుతున్నది. ఈ డబుల్ బెడ్రూం విషయంలో నాయి బ్రాహ్మణ, రజకులకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంతో పోలిస్తే ధర్మపురి నియోజకవర్గంలో 1000 డబుల్ బెడ్రూం మంజూరు కావడం, ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గానికి ఎంత ప్రధాన ఇచ్చారో ఆ విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు మంత్రి కొప్పుల.

ఈ డబుల్ బెడ్రూం డిమాండ్ ఉన్న అంశం. ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనారిటీ లకు ఇల్లు కావాలని ఆకాంక్ష అందరికీ ఉంటుంది. కాబట్టి ఈ కళ తెలంగాణ రాష్ట్రంలోనే నెరవేరుతుంది.జీహెచ్ఎంసీ ఎన్నికలలో రజకులకు సంబంధించి 250 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాల నాయి బ్రాహ్మణుల సెలూన్ల ఆధునిక కొరకు వారికి 1లక్ష రూపాయలు ఇచ్చి ప్రోత్సహించాలని భావిస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.

- Advertisement -