ఆ రెండు ఎమ్మెల్సీలు మేమే గెలుస్తాం: మంత్రి కొప్పుల

120
- Advertisement -

కరీంనగర్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు టీ భానుప్రసాద్ రావు, ఎల్ రమణ మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. అంతకు ముందు కరీంనగర్‌లోని పద్మనాయక కళ్యాణ మండపంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ ఫారాలు ఇక్కడే ప్రిపేర్ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కాప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను తమ పార్టీ గెలుచుకుంటుందన్నారు. జిల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 1,326 ఓట్లు ఉండగా ఇందులో 996 మంది టీఆర్ఎస్‌కు చెందిన వారే ఉన్నారని అన్నారు.

21 ఏళ్లలో టీఆర్ఎస్ అనేక ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కలిసి కట్టుగా పని చేసి కేసీఆర్ ఆశీర్వదించి పంపిన భానుప్రసాద్ రావు, ఎల్ రమణ గెలుపుకు కృషి చేయాలని మంత్రి కొప్పుల కోరారు. అనంతరం భానుప్రసాద్, రమణలతో కలిసి నామినేషన్ వేసేందుకు వెళ్లారు.

- Advertisement -