‘థ్యాంక్యూ’.. ఫస్ట్‌ లుక్‌తో ఆకట్టుకున్న చైతూ..

126
- Advertisement -

టాలీవుడ్‌ యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా రాశి ఖన్నా నటించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో మరో ఇద్దరు కథానాయికలు ఉన్నారు. వారే మాళవిక నాయర్ – అవికా గోర్. ఈ ఇద్దరి పాత్రలకి ప్రాధాన్యత ఉండటం విశేషం. ఇది ఒక విభిన్నమైన ప్రేమకథా చిత్రం. కాగా మంగళవారం చైతూ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.

ఈ పోస్ట‌ర్‌లో క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని కాస్త గ‌డ్డంతో ఉన్న అక్కినేని నాగ‌చైత‌న్య తిరునాళ్ల‌లో తిరిగే రంగుల రాట్నంలో ఉండే గుర్రంపై ఎక్కి కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ చిత్రానికి బి.వి.ఎస్‌.ర‌వి క‌థ‌, మాట‌ల‌ను అందించారు.

- Advertisement -