మంథని గొడవల్లో రాజకీయ ప్రమేయం లేదు: కొప్పుల

260
koppula eshwar
- Advertisement -

గత రెండు నెలలుగా కాంగ్రెస్ పార్టీ మంథని లో ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. మంథని లో జరిగిన సంఘటనలను టీఆర్‌ఎస్‌కి అంటగట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కొప్పుల..ఒక గ్రామంలో వ్యక్తిగతంగా జరిగిన సంఘటనకు కాంగ్రెస్ అధిష్టానం స్పందించడం అమానుషం అన్నారు.

కాంగ్రెస్-బీజేపీ కి ఏం చేయాలో అర్థం కాక అనవసర రాజకీయ ఆరోపణలు చేస్తున్నాయి…చలో మల్లారం కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు గ్రామానికి వెళ్తే నిజానిజాలు తెలిసేవన్నారు. 40 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దళితులకు చేసింది ఏమిలేదు.…మంథనిలో జరిగిన సంఘటనలు వ్యక్తిగత కుటుంబాలకు చెందినవన్నారు. కుటుంబ సంఘటనలను పార్టీకి అంటగట్టడం కరెక్ట్ కాదని.…15వేల ఎకరాల భూమిని దళితులకు ఇప్పటికే పంపిణీ చేశాం అన్నారు. భూమి దొరకడం లేదు కాబట్టే మూడెకరాల భూ పంపణి మెల్లగా సాగుతోంది.…దళితులకు మూడెకరాల భూ పంపిణీ నిరంతరం కొనసాగే కార్యక్రమం అన్నారు.

మంథని లో ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవను కాంగ్రెస్ పార్టీ భూతద్దంలో పెట్టి చూపిస్తోందన్నారు జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు. రంగయ్య అనే వ్యక్తి మరణిస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది…టీఆరెస్ పార్టీ కార్యకర్త- టీఆర్‌ఎస్ వ్యక్తి మరణిస్తే కాంగ్రెస్ కి ఏం సంబంధమో అర్ధం కావడం లేదన్నారు. రాజబాబు- శ్రీనివాస్ పక్క పక్క ఇల్లు- ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఒకరు మరణించారని తెలిపారు. ఇలాంటి ఘటన దేశంలో ఎక్కడా జరగలేదు అన్నట్లు కాంగ్రెస్ ప్రవర్తిస్తోందని ..కాళేశ్వరం లో కాంగ్రెస్ నాయకుడు బందెల వెంకటస్వామి మరణిస్తే కనీసం పరామర్శించలేదన్నారు. దళితుల కోసం పోరాటం చేయాల్సిన పెద్ద నాయకులు భట్టి చెప్పిన మాటలు విని మాట్లాడటం కరెక్ట్ కాదు…మంథని లో జరిగిన సంఘటనల్లో రాజకీయ ప్రమేయం ఎక్కడ లేదన్నారు.

- Advertisement -