జగిత్యాల జిల్లా ధర్మపురి మండల రాజారాం, తిమ్మాపూర్ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రైతు వేదికలు, సంఘం భవనాలు, గోదాం అదనపు తరగతి గదుల పనులకు ప్రారంభించి,శంకుస్థాపన చేశారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త దాన్ని మనం చూస్తున్నాం ఇవి దేశంలో ఎక్కడ వెతికిన కనబడదు ఇటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి రైతాంగాన్ని అన్ని రంగాల్లో ముందుంచి వాళ్లకు ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకువచ్చినట్లు అయితే తప్పనిసరిగా రాష్ట్రం యొక్క భవిష్యత్ మారిపోతుంది అన్నారు.
తెలంగాణ రాకముందు పూర్వం తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులకు కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్న ఇటువంటి తరుణంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. దేశానికే ఆదర్శవంతంగా మన రైతాంగాన్ని తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని మంత్రి అన్నారు. రైతు సంక్షేమ ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రైతు వేదికలు పూర్తయితే రైతులు ఒక వద్ద కూర్చొని మాట్లాడుకోవడం,పంటలకు ధరలు నిర్ణయించుకునే అవకాశం దొరుకుతుందని వెల్లడించారు. రైతు వేదికల నిర్మాణం అనేది రైతును రాజుగా చేసేందుకు రైతు శాసించే రాజ్యం తెచ్చే క్రమంలో పెద్ద ముందడుగన్నారు.
నీటి తీరువా, భూమి శిస్తు వసూలు పన్నులన్నీ రద్దు చేసి రైతుకే ఎదురు ఏడాదికి పదివేలిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ గారు, తెలంగాణ వ్యవసాయరంగం దేశంలోనే ఒక అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నది..గత ఆరు సంవత్సరాలుగా రైతు అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను అందిసుతన్నాయని అన్నారు. నూతన రాష్ట్రం ఏర్పడిన 6 మాసాలో విద్యుత్ సమస్యను అధిగమించి రైతులకు నాణ్యమైన 3 ఫేస్ విద్యుత్ 24 గంటల పాటు ఉచితంగా రైతులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు.
నకిలీ విత్తనాలు మరియు గుర్తింపు లేని పురుగుల మందులు విక్రయిస్తున్న వ్యాపారస్తుల పై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రతి సంవత్సరం రూ.1200 కోట్లు ఖర్చు చేసి రైతుకు భద్రత కల్పించే దిశగా రైతు బీమా పథకం అమలు చేస్తున్నామని, కరోనా సంక్షోభ సమయంలో సైతం రైతు బంధు పథకానికి కోతలు విధించకుండా 15 వేల కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాలో జమ చేసామని మంత్రి అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో సైతం ప్రజా సంక్షేమ పథకాలకు ఎలాంటి కోత విధించ లేదని కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్, ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలను కొనసాగించామని మంత్రి తెలిపారు. రైతుల కోసం నిర్మించిన రైతు వేదికలను, కల్పిస్తున్న సదుపాయాలను రైతులు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.
రైతు వేదికల నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు రైతులు హజరుకావాలని, వారి సందేహలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. రైతు వేదికలను వినియోగించుకుంటూ రైతులు మార్కెట్ లో పంట డిమాండ్, గిట్టుబాటు ధర, పంటలు పండించడంలో మెలుకవులు, ఎరువులు, విత్తనాల వినియోగం వంటి వాటి పై చర్చించాలని, మంచి పద్దతులను తెలుసుకొని పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రి మనం అడక్కుండానే ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. ఒంటరి మహిళలకు పెన్షన్ వస్తుంది వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ వస్తుంది, రైతు బీమా వస్తుంది రైతుకు సంబంధించిన రైతుబంధు వస్తుంది దాదాపు ఒక గ్రామానికి ఒక కోటి కోటి రూపాయలు ఒక గ్రామానికి ప్రభుత్వం నిధులు వస్తాయి కల్యాణలక్ష్మి కింద డబ్బులు వస్తున్నాయి. అదే విధంగా మరి మాతా శిశు ప్రోగ్రామ్ కింద ఆడపిల్ల పుడితే 13 వేల రూపాయలు మగబిడ్డ పుడితే 12 వేల రూపాయలు వస్తాయి అన్నారు.
ఈ రోజు ఈ పల్లె ప్రగతి అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో గ్రామాల యొక్క రూపురేఖల్ని మార్చేసింది, ఒక గ్రామంలో ఏ ఉండాలి అవన్నీ కూడా దాదాపుగా గ్రామాలలో ఉన్న ప్రజలందరికీ కావలసినటువంటి అవసరాలకు పరిష్కారం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామానికి ఒక వైకుంఠధామం ఉండాలని ఎటువంటి ఆలోచనలు చేసినటువంటి మహా నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కొనియాడారు.