పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి..

190
minister koppula
- Advertisement -

ఈరోజు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఎస్‌డీఎఫ్‌ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 14.80 లక్షల అంచనా వ్యయంతో మేరు కులస్థులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన, దుర్గమ్మ కాలనీ నుండి అయ్యప్ప గుడి మరియు కమలాపూర్ వరకు 67 లక్షలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, 31 లక్షల అంచనా వ్యయంతో కమలాపూర్ రోడ్డు నుండి కెనాల్ మరియు ఇందిరమ్మ కాలనీ వరకు రోడ్డు నిర్మాణాలకు భూమి పూజా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ పేద రాష్ట్ర అభివృద్ది కోసం ఎంతో కృషి చేస్తున్నారు. మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని మంత్రి కొప్పుల పేర్కొన్నారు.

అనంతరం ధర్మపురి పట్టణ కేంద్రంలో ‘ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే రోలింగ్ క్రికెట్ కప్’ క్రికెట్ పోటీల కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ పోటీలను ప్రారంభించారు మంత్రి కొప్పుల. ఈ కార్యక్రమంలో క్రికెట్ ట్రోఫీని ఆవిష్కరించి, టోర్నమెంట్‌లో పాల్గొంటున్న జట్టులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ చిట్టి బాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, మునిసిపాలిటీ ఛైర్ పర్సన్ సంగి సత్తమ్మ, వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ అయ్యోరి రాజేష్,ఏఎంసీ వైస్ ఛైర్మన్ సునీల్, వైస్ ఎంపీపీ గుర్రం మహిపాల్ రెడ్డి, కౌన్సిలర్ లు, పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -