హోలీ వేడుక‌ల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల..

89
- Advertisement -

కరీంనగర్ శ్రీపురం కాలనీలో కాలనీ చిన్నారులతో కలిసి హోలీ వేడుక‌ల్లో పాల్గొన్న మంత్రికి చిన్నారులు తిలకం దిద్దారు. అనంతరం మంత్రి చిన్నారులతో కాసేపు ఆప్యాయంగా పలకరించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హోళీ పండుగ‌లు మ‌న సంస్కృతిని చాటి చెప్తాయ‌న్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వ‌య‌సుల వారు ఎంతో సంతోషంగా హోలీ జ‌రుపుకోవ‌డం అనాదిగా వ‌స్తుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారుని తెలిపారు. అనంతరం మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -