హోటల్ టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్ కం ఓనర్ పథకం కింద లబ్ధిదారులకు కార్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరైయ్యారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు,సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ మిశ్రా,మైనార్టీ శాఖ సలహాదారు ఏకే ఖాన్,క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఎండీ క్రాంతి వెస్లీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. క్రిస్టియన్ మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా లబ్ధిదారులకు కార్ల పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. లబ్ధిదారులకు శుభాకాంక్షలు, ఇది మంచి కార్యక్రమంనిరుద్యోగులు అయిన వారికి ప్రభుత్వం ఒక్క సపోర్ట్ ఇవ్వాలని ఇలాంటి కార్యక్రమాలకు స్వీకారం చుట్టారు సీఎం కేసీఆర్. గతంలో ఎవరి దగ్గరో డ్రైవర్ గా పనిచేసిన మీకు మీరే ఓనర్ గా ఉండడం ఎంతో గొప్ప విషయం. మీకు మీరు బాగుపడాలని ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. 60 శాతం సబ్సిడీపై మీకు కార్లు ఇస్తున్నాం దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మీ జీవితంలో వెలుగు నింపాలనేది మా ముఖ్యమంత్రి ఉద్దేశ్యం. ఇవ్వళ 133 కార్లు అందిస్తున్నాము అలాగే మరో విడతలో కూడా లబ్ధిదారులను ఎంపిక చేశాం త్వరలోనే ఇస్తాం.తెలంగాణ రాష్ట్రం రాకముందు క్రిస్టియన్ లను ఎవరు పట్టించికోలేదు. కానీ టీఆరెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మనకు అండగా ఉంటున్నారు. అందరూ మన వారే గుర్తించిన వ్యక్తి సీఎం కేసీఆర్. గతంలో చర్చిలు కట్టాలి అంటే కలెక్టర్ అనుమతి తీసుకోవాలని ఉండేది కానీ సీఎం కేసీఆర్ దాన్ని రద్దు చేశారు. క్రిస్టియన్ లకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మీ సమస్యలను త్వరలోనే పరిస్కారం అవుతాయన్నారు మంత్రి కొప్పుల.
రాష్ట్ర వ్యాప్తంగా 66 ఎకరాల బరియల్ గ్రౌండ్ ఇచ్చాము. క్రిస్మస్ పండుగ ను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా జరుపుకున్నాం. రెసిడెన్షియల్ స్కూల్ చాలా అద్భుతంగా విద్యను అందిస్తున్నాం. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి విద్యను అందించడం లేదు. క్రిస్టియన్ లను కూడా ప్రభుత్వ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లలో విద్యార్థులను పంపించాలి. ఇది మన ప్రభుత్వం మన కోసం ఉన్నటువంటి ఉన్న ప్రభుత్వం.క్రిస్టియన్ విద్యార్థులకు బిసి రెసిడెన్షియల్ స్కుల్లలో కూడా 25 శాతం కోట ఉంది. ప్రైవేట్ కార్పోరేట్ రెసిడెన్షియల్ స్కూల్ లాగా మన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.